Smart City News logo

Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం

Sep 11, 2026 4:27 64 views 4

Description

Smart City: సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్
జోనల్ కౌన్సిల్ మీటింగ్ విశాఖపట్నం లో ఘనంగా నిర్వహించారు. జనరల్ సెక్రటరీ సి. హెచ్. శంకరరావు ఆధ్వర్యంలో C&W VSKP, C&W VSPS బ్రాంచ్ లకు సంబందించి నూతనంగా ఎన్నుకోబడిన సెక్రటరీ లు కనకారావు, బిసాయి ఇద్దకి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ ప్రధాన కార్యదర్శి PGJ రాజు, డివిజనల్ కార్యదర్శి PRM రావు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఎం. రావు మాట్లాడుతూ, జనరల్ సెక్రటరీ శంకర్రావు ఆధ్వర్యంలో అవినీతి రహితంగా కార్మికులకుసేవలందించాలని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణకు యూనియన్ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. కనకా రావు ,జగన్నాథ్ బిసాయ్ లను ఎన్నుకోవడం అదృష్టం గా భావిస్తున్నాని అన్నారు.
ఇకపై యూనియన్‌లో అవినీతికి ఎలాంటి అవకాశం ఉండదని, అవినీతికి పాల్పడినట్లు లేదా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్నట్లు నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఆ వ్యక్తిని వెంటనే యూనియన్ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
“అవినీతికి తావులేని యూనియన్ – కార్మికుల సంక్షేమమే లక్ష్యం” అనే నినాదంతో, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 13 సంవత్సారాలుగా పెండింగ్ లో ఉన్న అసిస్టెంట్ కలాసి సమస్య అయిన గ్రేడ్-3 ప్రమోషన్ లను వెంటనే ఇప్పించాలని కార్మికులు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో C&W బ్రాంచ్ ప్రెసిడెంట్, అధిక సంఖ్యలో కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.
Aug 25, 2026

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో …

Watch Now