Smart City News logo

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

Aug 25, 2026 2:27 99 views 3

Description

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడిని ఉద్దేశించి రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, స్థానికంగా పోటీ చేయాలనుకుంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదికగా.. కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే క్లాస్ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Related Videos

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.
Oct 7, 2026

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.

దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమం అవ్వకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నా…

Watch Now
Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం
Sep 11, 2026

Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం

Smart City: సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ విశాఖపట్నం లో ఘనంగా నిర్వహించారు. జనరల్ సెక్రటరీ సి. హెచ్. శంకరరావు ఆధ్వర్యంల…

Watch Now