Smart City News : CPS విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన విద్యావిధానం రద్దు చేయాలని అదేవిధంగా పదవతరగతి పరీక్షా పేపర్లు మూల్యాoకనమ్ రెట్టింపు చేయాలని డిమాండ్ చేస్తూ APTF ఆధ్వర్యంలో విశాఖపట్నం క్వీన్ మేరీ పాఠశాల గేటు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా అధ్యక్షుడు కోటాన శ్రీనివాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు పాత పెంక్షన్ విధానం అమలుచేయాలని తీర్పు ఇచ్చినా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం CPS రద్దు చేయకపోవడం అన్యాయమని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో పాత పెంక్షన్ విధానం అమలు చేస్తున్నారని, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు . ప్రతిపక్షం లో ఉన్నప్పుడు YS జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే CPS విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నిలబెట్టు కోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా పాత పెంక్షన్ విధానం అమలు చేయకపోతే ఉద్యమాన్ని `తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
395