Smart City: నిహాల్ కు పొట్టిగా ఉన్న కుడికాలును పొడవుగా చేసిన అపోలో ఆసుపత్రి డా. రవిచంద్ర వైద్యబృందం

by kishore226226@gmail.com
298 views

ఆరిలోవ హెల్త్ సిటీ లోని అపోలో హాస్పిటల్ నందు పెడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జస్ కాలుకు సంబంధించిన ఒక అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ వి. రవిచంద్ర తెలిపారు. ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయగడకు చెందిన 23 సంవత్సరాల రోగి నిహాల్ ఫిబులర్ హెమిమెలియా వ్యాధితో హాస్పిటల్ కి వచ్చారని తెలిపారు. అతనిని పరీక్షించగా కుడి కాలుకు పిబులర్ హెమిమెలియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
ఈ అరుదైన వ్యాధి 40 వేల పుట్టుకలలో ఒకరికి సంభవిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితి వల్ల రోగి కుడికాలు ఎడమ కాలు కంటే 2.5 సెం.మీ. పొట్టిగా ఉందని, దీనివల్ల అతనికి నడవటం చాల కష్టంగా ఉండేదన్నారు. లింబ్ ను 3 ధమనులు పోషిస్తుంటాయని, కానీ ఈ కేసులో ఒక్క ధమని మాత్రమే ఆధారంగా ఉందన్నారు. అరుదైన ప్రత్యేకమైన కేసు శస్త్ర చికిత్స నిర్వహించే సౌలభ్యత కోసం రోగికి అనేక రకాల పరీక్షలు చేశామన్నారు. ఈ కేసును సవాలుగా తీసుకుని వాస్కులర్ సర్జన్స్, ఎనసీసీయ క్రిటికల్ కేర్ బృందం సహకారంతో సురక్షితమైన ప్రణాళికను రూపొందించి ఈ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో అపోలో సీఈఓ డాక్టర్ సమీ, ఆర్థోపెడిక్ బృందం డాక్టర్ నవీస్ పల్లా, డాక్టర్ అబ్దుల్ ఖాన్, పేషెంట్ నిహాల్ పాల్గొన్నారు.

Related Posts

Leave a Comment