Smart City: పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత . ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనంకోసం పాడేరు రావడం జరిగింది, నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నమినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగింది .ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని .వైసిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ60 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు .కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తో స్వాగతించడం అనందగా ఉంది. పదితలల రావణాసురుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యం అన్నారు. బీజేపీ కి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు.
#bjp #janasena #telugudesampartyofficial