Smart City News logo

Smart City: Fresh (Electric) Bus Services Started from Visakhapatnam to Vijayawada.

Jun 9, 2025 4:23 423 views 6

Description

Smart City: Fresh (Electric) Bus Services Started from Visakhapatnam to Vijayawada.
ఫ్రెష్ బస్ వారి ఎలక్ట్రిక్ బస్ సర్వీసు ప్రారంభం
విశాఖపట్నం 9 జూన్ 2025 : భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ బస్సు సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈరోజు విశాఖపట్నం -విజయవాడ & గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నది. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రవేశ పెట్టినట్లు ఫ్రెష్ బస్ వారు చెప్పారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుందని మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు.
ఫ్రెష్ బస్ సుస్థిరమైన సేవలను అందిస్తుంది. 98% ఖాతాదారుల కాల్స్ కు కేవలం 30 సెకండ్లలో సమాధానం ఇస్తుంది. మహిళా ప్రయాణికులు కొరకు 24/7 మహిళా హెల్ప్ లైను సౌకర్యం కూడ ఫ్రెష్ బస్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రతి బస్సు ప్రయాణం ఒక అద్భుతంగా మంచి విలువలతో సాగాలనే ఆలోచనలతో ప్రయాణికులకు లాయల్టీ అందిస్తున్నాది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి 10 గ్రీన్ కాయిన్స్ అందిస్తున్నాది. ప్రయాణికులు వీటిని తమ తదుపరి ప్రయాణ టిక్కెట్ల కొనుగోలు సమయంలో ఉపయోగించవచ్చును. విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు మరియు ఇతర ఫ్రెష్ బస్ రూట్ల టిక్కెట్లు freshbus.com లేదా ఫ్రెష్ బస్ యాప్ లో అందుబాటులో ఉంటాయి. తరచుగా ప్రయాణించే వారు 10 రైడ్ లలో ఒక్కో రైడ్ కు రూ.50/- ఆదా చేసుకోవడానికి ఫ్రెష్ కార్డును కొనుగోలు చేయవచ్చునని ఈ కార్డు ఆరు నెలలు పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు

Related Videos

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.
Oct 7, 2026

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.

దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమం అవ్వకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నా…

Watch Now
Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం
Sep 11, 2026

Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం

Smart City: సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ విశాఖపట్నం లో ఘనంగా నిర్వహించారు. జనరల్ సెక్రటరీ సి. హెచ్. శంకరరావు ఆధ్వర్యంల…

Watch Now
విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.
Aug 25, 2026

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో …

Watch Now