Smart City: K-1 ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ విజేతలను అభినందించిన M.L.A గణబాబు.

by kishore226226@gmail.com
95 views

Smart City: కె 1 ఓపెన్ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ అమెచూర్ అండ్ ప్రొఫిషనల్ ఫైట్ క్రీడాపోటీలు డిసెంబర్ 15,16,17, తేదీల్లో పి. ఎల్. రాయ్ ఇండోర్ స్టేడియం కలకత్తా లో నిర్వహించారు. ఈ పోటిల్లో ఆంధ్రప్రదేశ్ నుండి జూనియర్స్ విభాగం లో పి. గణేష్, ఎం. లక్ష్మణ్, బి. గణేష్ లు గోల్డ్ మెడల్ సాధించిగా బి. భవ్యశ్రీ, గా. సతీష్ లు సిల్వర్ మెడల్ సాధించారు. సీనియర్స్ విభాగం లో టి. హేమంత్, టి. గణేష్, ఎం పృథ్వి, సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎం. ఎల్. ఏ. గణబాబు కార్యాలయం లో విజేత లకు అభినందనలు తెలియజేసి పూల మాలతో సత్కరించారు. ఈసందర్బంగా ఎం. ఎల్. ఏ. గణబాబు మాట్లాడుతూ పిల్లలో క్రీడా స్ఫూర్తి పెపొందించే దిశగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కిక్ బాక్సర్ కె 1 అసోసియేషన్ రిఫరీ విమలరాజ్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు. క్రీడాకారులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో మరెన్నో పతకాలు మన దేశానికి, రాష్ట్రనికి తేవాలని చిన్నారులను ఆశీర్వదించారు. ఇంటర్ నేషనల్ రిఫరీ విమలరాజ్ మాట్లాడుతూ క్రీడాకారుల కు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎం. ఎల్. ఏ. గణబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలో మొత్తం 3 బంగారు, 5 వెండి పతకాలు సాధించామని, ప్రభుత్వం సహకారం అందిస్తే భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ రిఫరీస్ బి. భీమారావు, ఎస్. అనిల్, ఎం. శరత్ 57 వ వార్డు తెదేపా అధ్యక్షుడు పెంటకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Comment