Smart City:
వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ JCI, ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు అవార్డు ప్రధాన కార్యక్రమం డిసెంబర్ 10న విశాఖ ఋషికొండ సాయిప్రియ రిసార్ట్స్ లో నిర్వహిస్తున్నట్లు JCOM-ZONE-4 Chairman పట్టా ఉదయ్ కిరణ్ తెలిపారు. స్థానిక హోటల్లో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ JCI ఆఫ్ కామర్స్ లో బిజినెస్, కమ్యూనిటీ, ట్రైనింగ్, వ్యక్తిగత అభివృద్ధికి సభ్యులంతా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ వారి వారి వ్యాపార అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏడాది పాటు వ్యాపారంలో చూపించిన ప్రతిభకు పురస్కారం అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 400 మంది హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కమిటీ సభ్యులు జెసి రమేష్, జెసి నూకరాజు, జెసి శ్రీధర్, జెసి రామసూర్య, జెసి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.