Smart City: “AASRAA” 5th National Summit on Nov-24th-2023 at New Delhi. International Operations Head P. Ratna Raju
#veerumama #visakhapatnam
భారత దేశం లో అత్యంత ప్రతిష్ఠాత్మక వినియోగదారుల సంస్థ అయిన ఆశ్ర ( అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్) తన 5 వ జాతీయ సదస్సును నవంబర్ 24 న దేశ రాజధాని ఢిల్లీ లో కన్స్టిషన్ క్లబ్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ప్రతినిధి రత్న రాజు స్థానిక పబ్లిక్ లైబ్రరీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో తెలిపారు.సెలబ్రిటీ గస్ట్ గా టాలీవుడ్ ఆక్టర్ ఆలి, ముఖ్య అతిధి గా భారత దేశ వినియోగ దారుల సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ,అమెరికా ఆపరేషన్స్ హెడ్ హరి కృష్ణ, సోత్ కొరియా ఖనరీస్ ఫౌండర్ హాంగ్ సున్ యంగ్,బాబు భాయ్,ఆర్ ఆర్ టీమ్ , ఖంటేయం,ఐ టీ వీ సభ్యులు కార్యక్రమానికి హాజరవతారని తెలిపారు.ఆశ్రా మినిస్ట్రీ ఆఫ్ కాన్సుమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన సంస్థ గా దేశం లో సుమారు 1000 కు పైగా ప్రతినిధులతో చీఫ్ పట్రాన్,సుప్రీం కోర్టు లాయర్ హాబీబ్ సుల్తాన్ అలి నేతృత్వంలో పది రాష్ట్రాల్లో ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో వినియోగదారులకు అవగాహన కల్పించిన వారికి ప్రతిభా అవార్డ్ లు అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఇక్బాల్ తెలిపారు. సత్యమేవ జయతే అనే నినాదం తో , ఈరోజున దుబాయ్ , అమెరికా లాంటి దేశాల్లో సైతం ఆశ్రా తన ఔనత్యాన్ని చాటుతుంది అని, శత్రుఘ్నుడు అన్నారు. ఈ కార్యక్రమం లో దేశ విదేశాల ప్రతినిధులు, అలాగే సౌత్ కొరియా నుండి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు అని ఈవెంట్స్ హెడ్,అంతరజాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ తెలిపారు.అనంతరం ప్రత్యేక పోస్టర్ ను ఆశ్రా ప్రతినిధులు ఆవిష్కరించారు.