Smart City: అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకున్న బిజెపి కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో గీత కు గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి అభ్యర్థుల్నే గెలిపించుకుందామని కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అభ్యర్థించారు.అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఆమె వెంట కలిసి రాగా ప్రచార రథంపై నుంచి గీత మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధేమీ జరగలేదని, ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజనుల జీవితాలు అలాగే ఉండిపోయాయంటూ పెద్ద ఎత్తున అక్కడి వారంతా నినాదాలు చేశారు. ఏజెన్సీల్లో ప్రధాన రహదారి అయిన అరకు మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే కూడలిలో చెరువును తలపించేలా రోడ్లు కనిపిస్తున్నాయంటూ ప్రభుత్వ తీరును కొత్తపల్లి గీత ఎండగట్టారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అరకు లోయకు తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అద్దాల రైలు గూర్చి ప్రస్తావించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మెడికల్ కళాశాల లతో పాటు 450కి.మీ మేర నేషనల్ హైవే తీసుకు వచ్చిన ఘనత తనదేనని గీత గుర్తు చేశారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల్నే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచారంలో అభ్యర్ధులు తో పాటు ఉమ్మడి పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.