Smart City:
సమాజ సేవతోనే మానవ జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందనీ సీఎంఆర్ సంస్థల వ్యవస్థాపకులు చందన మోహన్ రావు అన్నారు.. ఇక్కడ జగదాంబ సీఎంఆర్ షాపింగ్ మాల్ లో గురువారము నగరానికి చెందిన సంపూర్ణ దివ్యాంగులు సంస్థ సభ్యులు తయారు చేసిన ప్రమిదల స్టాల్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్నిరంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు… సంపూర్ణ దివ్యాంగుల సంస్థ సభ్యులు తయారు చేసిన ప్రమిదలను గత 20 ఏళ్ళుగా సీఎంఆర్ లో విక్రయాలు జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సిఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ చేతుల మీదుగా ప్రతియేటా సంపూర్ణ సంస్థ నిర్వాహకురాలు సత్య , ఇతర సభ్యులకు రూ. 50 వేల రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తమ సంస్థల తరపున తగిన సహకారం అందిస్తామన్నారు.సంపూర్ణ సంస్ధ.సభ్యులు ఎంతో కష్ట పడి అందంగా తయారు చేసిన ప్రమిదలకు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కూడా జర్నలిస్టుల తరపున 10,000 రూపాయల మొత్తాన్ని సంపూర్ణ సంస్థ సభ్యులకు అందజేశారు.. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్ట్ ల తరపున ప్రతీ ఏటా కొంత మొత్తం అంద చేస్తున్నామన్నారు..సదరు సంస్థ సభ్యులు తయారుచేసిన ప్రమిదలును తాము కొనుగోలు చేస్తున్నట్లు గంట్ల శ్రీను బాబు చెప్పారు.