Smart City: శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అష్ట లక్ష్మి దేవి అమ్మవారి కుంకుమార్చన

by kishore226226@gmail.com
158 views

శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకరమఠం వద్ద శ్రీ అష్ట లక్ష్మి దేవి సహిత మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ్ రామ్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ ఆంద్ర, తెలంగాణా డైరెక్టర్ కొట్టారి సునీత మాట్లాడుతూ శ్రీ తాళ్ళపాక వామిజీ ఆదేశాల మేరకు అష్ట లక్ష్మి దేవి సహిత మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపించామని, లోక కళ్యాణార్ధం కుంకుమార్చన పూజలు చేశామని తెలిపారు. రామ్ రామ్ గురూజీ మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఇటువంటి పూజలు చేయడం వలన జనులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు శ్రావణమాసంలో ఇటువంటి పూజలు చేయాలని అన్నారు. ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఎటువంటి రుసుము తీసుకోకుండా నిర్వహించిన వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

Related Posts

Leave a Comment