Smart City: వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులను ఆదరించే పార్టీకే మా మద్దతు. VKBAPSSS

by kishore226226@gmail.com
84 views

Smart City: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సీటును సీతమ్మరాజు సుధాకర్ కు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రాహ్మణ సంఘాల నేతల విజ్ఞప్తి చేశారు. సింహాచలంలో నిర్వహించిన విశాఖ బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘము నేతలు శివ గణేష్, విజయ్, సుశీల మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటును బ్రాహ్మణులకు కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు ఈ సీటును ప్రతిసారి బ్రాహ్మణ కులస్తులు గెలుచుకోవడం జరుగుతూనే ఉందని తెలిపారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే దక్షిణ నియోజకవర్గ సీటును బ్రాహ్మణులకే కేటాయించాలని రాజకీయ పార్టీలకు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. తమ వర్గానికి సీటు కేటాయించిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.

Related Posts

Leave a Comment