Smart City: ముడసర్లోవ ప్రాంగణంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వ్యవస్థపకులు, తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం వారసులు, తిరుమల నిత్య కైంకార్య పరులు తాళ్లపాక హరి నారాయాణాచార్యులు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీమతి సునీత కోఠారీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టర్ గా స్వామి ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారు. అనమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా విశిష్ట సేవలు చేసిన team లీడర్స్ కి స్వామి చేతుల మీదుగా సత్కరించారు. తాళ్లపాక హరి నారాయాణాచార్యులు మాట్లాడుతూ పరమాత్మకు సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దైవ దర్శనానికి వెళ్లే భక్తులకు సేవ చేయటం వలన కూడా అంతకు రెట్టింపు పుణ్యం కలుగుతుందని తెలిపారు . ఆధ్యాత్మిక సేవ చేయాలనే ఉద్దేశంతో సేవా సంస్థలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా నిష్కామకర్మతో సేవ చేయాలని పిలుపునిచ్చారు. సేవతోనే జీవితం సార్థకత అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. అన్నమయ్య సేవ సంస్థ ద్వారా చక్కగా సేవలు అందించి సేవకులు ధన్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎం.వి. రాజశేఖర్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దినేష్ రాజు, శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సేవకులు పాల్గొన్నారు.
289