smart city news: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత . పాచిపెంట , సాలూరు,మక్కువ లో పార్టీశ్రేణులను,కార్యకర్తలను, ప్రజలను కలసి కమలం గుర్తుకు ఓటేసి నన్ను ,సైకిల్ గుర్తులకు ఓట్లేసి ఎంఎల్ఏ ను గెలిపించాలని కోరారు . ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పాచిపెంట మండలంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో గీత సొసైటీ చెప్పట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లు గుర్తుచేస్తుంటే చాలా ఆనందంగా ఉందని , 2014లో నేను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలిచిన నేను నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడం బయటకు రావడం, అప్పటినుంచి అన్ని పార్టీలతోటి సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారని గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పని చేయాలని. గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండు కానీ గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజలకు మంచి చేయవలసిన బాధ్యత ఉందని కాబట్టి అందరితో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగిందని ,ఆయన ఆదేశాలు మేరకే నేను అందరితోటి కలిసి పనిచేశానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వీలున్నంతవరకు అభివృద్ధి చేయగలిగినంత చేశాను కానీ అప్పుడు ఒక రీజనల్ పార్టీలో,ప్రస్తుతం బీజేపీ లాంటి పెద్ద పార్టీనుండి పోటీచేయడంతో మరిన్ని అభివృద్ధి పనులను,ప్రాజెక్టులను తీసుకురావడానికి అవకాశముందని తెలిపారు. పార్లమెంట్ విధి విధానాలు తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని ప్రస్తుతం చూస్తే మనలో గెలిచిన చాలా మంది ఎంపీలకి ఇప్పటికి ఒక క్వశ్చన్ ఎలా అడగాలన్నది తెలియని పరిస్థితిలో పార్లమెంట్ లోఎన్నికైన కొంతమంది ఉన్నారని తెలిపారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు మనకు ఈ ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పటివరకు పార్లమెంట్లో ఎన్ని సార్లు మాట్లాడారో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు గతంలో 25 మంది ఎంపీలలో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగానని ,హాజరు సైతం 97% సాధించానని అలాగే ఎక్కువ డిబేట్స్ లో పాల్గొన్నానని తెలిపారు.