Smart City: చిన్న పిల్లలలో వచ్చే కంటి కాన్సర్ పై అవగాహన కల్పిస్తూ విశాఖ సాగరతీరంలో 3కె, 5కె రన్ ను LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ చిన్నపిల్లలలో white reflex ఉంటే తక్షణమే చికిత్స చేయిచుకోవాలని కోరారు. white reflex ఫోటో తీసేటప్పుడు కంటిలో కనపడుతుందని చెప్పారు. అశ్రద్ద చేస్తే కంటిచుపుతో పాటు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని అన్నారు. white reflex పై తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని పిల్లల్లో కంటి కాన్సర్ గుర్తించి పిల్లల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు.