smart city news: అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజనం ఆసక్తిగా చూస్తున్నారు. గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండడంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రెటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండడంతో ఇది కూడా ఒకింత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే ఎవరైనా బౌన్సర్లగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకింత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను పెట్టుకోవడంపై అన్నివర్గాలు హర్షిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు కన్పించని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు.
84