Smart City: రానున్న శ్రావణమాసంలో క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూన్ 12న శ్రావణ లక్ష్మి – 2022 ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్ ఉషారాణి తెలిపారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఈవెంట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12న శివాజీ పార్క్ ఎదురుగా గల సవేరా ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న ఈ పోటీలు మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా 18 ఏళ్ల పైబడిన అమ్మాయిలు, మహిళలకు రెండు కేటగిరీల్లో జరుగుతాయన్నారు. స్త్రీలకు అత్యంత ప్రీతి అయిన శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా వరలక్ష్మి గోల్డ్ కాయిన్, పట్టుచీర, పసుపు కుంకుమ అందజేస్తామని చెప్పారు. ఈ పోటీల్లో విశాఖలోని ఆసక్తిగల మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.