Smart City: కులగణన చేపడతామన్న ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు. పోతల ప్రసాద్ నాయుడు.

by kishore226226@gmail.com
85 views

Smart City: నవంబర్ 14 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన నిర్వహించడం పట్ల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతైనా హర్షణీయమని జ్యోతిబాపూలే ఆలిండియా OBC అసోసియేషన్ అధ్యక్షులు పోతాలప్రసాద్ నాయుడు అన్నారు. ఆల్ ఇండియా OBC అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. బీహార్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏ విధంగా అయితే కులగణను నిర్వహిస్తున్నాయో మిగతా రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి కులగణనను నిర్వహించాలని కోరారు. కులగణన  నిర్వహణ కోసం మేము ఇదివరకే జాతీయ నాయకులైన జెపి నడ్డా ను మరియు రాహుల్ గాంధీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు ముఖ్యమంత్రి జగన్ కు కులగణ న కు మరియు పార్లమెంట్లో మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తక్షణం బిజెపి మరియు కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో  చేపట్టాలని   కులగణన ను చేపట్టాలనిలేకపోతే బీసీలు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి అన్ని రాష్ట్రాలకు కులగణన నిర్వహించేలా పోరాటం చేస్తామని తెలిపారు.

Related Posts

Leave a Comment