Smart City: ఉపకార్ చారిటబుల్ ట్రస్టు అధినేత, సామాజిక వేత్త కంచర్ల అచ్యుతరావుకు గౌరవ డాక్టరేట్ లభిచింది. తమిళనాడులోని హోసొర్‌లో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్శిటీ, ఇచా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజసేవ కేటగిరిలో విశాఖకు చెందిన కంచర్ల అచ్చుతరావుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రముఖల చేతుల మీదుగా ప్రధానం చేశారు . విశాఖ నగరంలోని పేద ప్రజలకు, కళాకారులకు, క్రీడాకారులకు అచ్యుతరావు నగరంలోని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, సామాజిక సేవ కళారంగానికి అచ్యుతరావు చేస్తున్న సేవకు గాను ఈ గౌరవం దక్కింది. ఈ డాక్టరేట్ లభించడంపై నగరంలోని పలువరు కళాకారులు, క్రీడా అభిమానులు, నగరంలోని ప్రముఖలు హర్షం వ్యక్తం చేశారు . మానవత్వానికి మరో పేరు సేవా తత్వానికి నిలువెత్తు నిదర్శనం ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు అని ప్రశంసించారు.