Smart City: ఏప్రిల్ 17 న న క్యాన్సర్ మీద అవగాహన కోసం ఫ్యాషన్ షో

by kishore226226@gmail.com
73 views

కే జే ఎం ఎంటర్ టైన్మెంట్, విశ్వ భారత్ మీడియా సారథ్యం:
కే జే ఎం ఎంటర్ టైన్మెంట్, విశ్వ భారత్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ ఐకానిక్ దివా – 2024 సీజన్ 4 ఆడిషన్స్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్ లో గల అంబికా సీ గ్రీన్ హోటల్ లో గురువారం రాత్రి జరిగింది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన, ఇంకా సహాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టము అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పో స్ట ర్ అవిస్కరణ చేశారు. ఆడిషన్స్ రెండో దశ విజయ వాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో జరుగుతాయి. అలాగే, మూడో దశ ఆడిషన్స్ తిరుపతి పట్టణంలో జరుగుతాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కే జే ఎం ఎంటర్ టైన్మెంట్ ఫౌండర్ కవిత కిషోర్, మాట్లాడుతూ, ప్రజలకు సామాజిక సందేశం అందించడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు.
ముంబాయి, గోవా నగరాల్లో ఫాషన్ షోలు నిర్వహించాము అన్నారు. ఇప్పుడు హైదరాబాద్, విశాఖ నగరాల్లో కూడా నిర్వహిస్తున్నాం అన్నారు.
ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలి అని కోరారు. ఈ ఫ్యాషన్ షో ఏప్రిల్ 17 న విశాఖ బీచ్ రోడ్ లో గల అంబికా సీ గ్రీన్ హోటల్ లో జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల వారికి ఆడిషన్స్ వుంటాయి అన్నారు.

కె జే ఎం ఎంటర్ టైన్మెంట్ పార్టనర్
రియాన్స్ శర్మ మాట్లాడుతూ, క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టాలా అవగాహన కల్పించేలా ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాం అన్నారు.

విశ్వ భారత్ మీడియా
చైర్మన్ బలివాడ రమేష్ మాట్లాడుతూ, మోడల్స్, డిజైనర్స్ కోసం కుసుమ లత సహకారం అందిస్తున్నారు అని తెలిపారు. ఫ్యాషన్ షో అన్నది తల్లి నేర్పే అడుగుల తోనే మొదలవుతుంది అన్నారు. క్యాన్సర్ అంటే ప్రజలకు ఎంతో భయం కలుగుతుంది అన్నారు. ముంబాయి లో ఒక ఫ్యాషన్ షో ద్వారా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు అని గుర్తు చేశారు. కే జే ఎం ఎంటర్ టైన్మెంట్ సంస్థ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుతున్నారు అని ప్రశం సించారు. మహిళా మూర్తుల ఫ్యాషన్ షో ద్వారా క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నారు అన్నారు.

మెడి కవర్ ఆస్పత్రి
డాక్టర్ దేవ్ మాట్లాడుతూ, ప్రజల్లో క్యాన్సర్ మీద అవగాహన కోసం కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. ప్రపంచ దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుంది అన్నారు. ఫ్యాషన్ షో ద్వారా ఈ సంస్థలు క్యాన్సర్, ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తున్నారు అని తెలిపారు.

ఫెంపెరియల్స్ అధినేత
సంగీత రెడ్డి అయ్యర్ మాట్లాడుతూ, కే జే ఎం సంస్థ తో సంయుక్తంగా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

మిష్టర్ ఆంధ్ర – 2019
అభిలాష్ మాట్లాడుతూ, వృత్తి లో భాగంగా ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం వారు ఫ్యాషన్ షో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారత్ మీడియా ఎం.డి. భీమర శెట్టి వాసు దేవ రావు, కోవిధ సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ అనూహ్య రెడ్డి సిద్దు, వీ జ్యూయల్లర్స్ ప్రతినిధి బాబు రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Comment