Smart City: FISC-AA DYNAMICS Eents “Vizag Super Star” Poster Launch
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి ఎడిక్ట్ అయి పిల్లలు తమ మానసిక శక్తి కోల్పోతున్నారని…పిల్లల్లో పోటీతత్వం పెంచి సృజనాత్మకత వెలికి తీయాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఆంధ్రాయూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్ లు పేర్కొన్నారు. FISC-AA ప్రజెంట్స్ వైజాగ్ నెక్ట్స్ సూపర్ స్టార్ ఈవెంట్ పోస్టర్ ను అతిధుల చేతులుమీదుగా ఆవిష్కరించారు. రాంనగర్ లోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, Au రిజిస్ట్రార్ కృష్ణ మోహన్ లు మాట్లాడుతూ 3 వేల మంది స్కూల్ విద్యార్థుల మధ్య పోటీతత్వం, ప్రతిభ వెలికితీసే కార్యక్రమం అభినందనీయమన్నారు. తప్పకుండా అన్ని స్కూల్ యాజమాన్యాలు కూడా ఇలాంటి కాంపిటేషన్స్ ను ఒక గొప్ప అవకాశంగా భావించి…విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.
పిల్లల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు చాలా అవసరమన్నారు. చిల్డ్రెన్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుండి పిల్లల్లో పోటీతత్వం పెంచితే భవిష్యతును ఒక ఛాలెంజ్ గా తీసుకుని రాణించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ్, విశ్వభారత్ రమేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు.
200