Smart City: అను హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య నిపుణులతో సదస్సు నిర్వహించడం అభినందనీయం.జిల్లా కలెక్టర్ మల్లికార్జున.
మారుతున్న వైద్యావిధానం లో నూతన పోకడలను అందిపుచ్చుకునేందుకు హృద్రోగ,మెదడు,నరాల సంబంధిత వైద్యానిపుణులకు మెళకువలు నేర్పే దిశగా అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యుత్తమ వైద్య నిపుణులతో సదస్సు నిర్వహించడం అభినందనియమని జిల్లా కలెక్టర్ మల్లికార్జున కొనియాడారు. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డిక్ సైన్సస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారం తో ఏర్పాటు చేసిన కార్డియాక్, న్యూరో ఉత్తరాంధ్ర ఒక్క రోజు సదస్సు ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వి. సుధాకర్,హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. .ఈ సదస్సు లో రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వెంకటాచలం,ఏఏంసి రిటైర్డ్ ప్రొఫెసర్ పి. రమణారావు, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.