Smart City: అర్హత కలిగిన అభ్యర్థులకు మారిటైం బోర్డు ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాయల వెంకటరెడ్డి అన్నారు. ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ రెండవ సర్వసభ్య సమావేశం విశాఖపట్నం ప్రముఖ హోటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి , బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఎస్.ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలనుండి బాక్సింగ్ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గతంలో నిర్వహించిన సీ.ఎం. బాక్సింగ్ కప్ కు విశేష ఆదరణ లభించిందని అన్నారు. రాబోయే రోజుల్లో బాక్సింగ్ క్రీడాకారులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కాయల వెంకటరెడ్డి కి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. క్రీడలలో బాక్సింగ్ క్రీడకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యెల్లపు రఘురాం. ఆంద్ర విశ్వ విద్యాలయం పీ.డీ. కృష్ణా రెడ్డి. పోర్ట్ యూనియన్ నాయకుడు చందు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
161