374
			
				            
			
			        
    Smart City: విశాఖలో వినాయక ఉత్సవాలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మద్దిలపాలెం 23వ వార్డు పరిధి, చైతన్యనగర్ లో శ్రీ సాయినాధ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా గణపతి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 12 అడుగుల విగ్రహాన్ని పెట్టామని అన్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, 7వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపి అనంతరం భారీ ఊరేగింపుతో వినాయకున్ని నిమజ్జనం చేస్తామని శ్రీ సాయినాధ్ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
