176
Smart City: డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల వారు రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ వారితో కలిసి సంయుక్తంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షిఫ్ట్ వేవ్ టెక్నాలజీస్ స్పాన్సర్ చేసింది.ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, రోటరీ బ్లడ్ బ్యాంక్ అధికారులు తమ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని అభినందించారు. డాక్టర్ జి మధు కుమార్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ విద్యార్థులందరినీ అభినందించారు.