Smart City: ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం. ఘటనపై స్పందించిన DSP-2 ఆనంద్ రెడ్డి.

by kishore226226@gmail.com
180 views

Smart City: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఆదివారం (19-11-2023) అర్ధరాత్రి 12 గంట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో సుమారు 70 వరకు ఇంజిన్ తో ఉన్న బోట్లు దగ్ధం. రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మంటలను అదుపు చేస్తున్న ఫైర్ ఇంజన్లు. బోట్లలో ఇంజన్లతో పాటు డీజిల్ ఆయిల్, వంట గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఒక్కొక్క బూటు విలువ రూ.40 లక్షల నుంచి రూ 50 లక్షల వరకు ఉంటుంది. ప్రమాదం వల్ల సుమారు 35 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల మత్స్యకారులతో పాటు బోట్లు యజమానులకు కూడా తీవ్ర నష్టం కలిగింది. ప్రమాదం కారణాలు తెలియ రాలేదు.

Related Posts

Leave a Comment