Smart City: నగరానికి చెందిన వైజాగ్ వారియర్స్ జెసిఐ క్లబ్ నర్సీపట్నం లో 350 పుస్తకాలతో ఈరోజు గ్రంథాలయాన్ని ప్రారంభించింది. వన్ లోకల్ ఆర్గనైజేషన్ వన్ సబ్ స్టాన్షియల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. జే సి ఐ జోన్ ఆఫీసర్ ట్రైనింగ్స్ డాక్టర్ R. వెంకటేశ్వరరావు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ యువతతో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ విజ్ఞానాన్ని సంపాదించేందుకు యువత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటూ.. పుస్తక పఠనం అలవాటు చేసుకుని ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. ఇక్కడి గ్రంధాలయంలో 2,500 లకు పైగా పుస్తకాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ వారియర్స్ అధ్యక్షులు R. వెంకటరమణ, ఉపాధ్యక్షులు రామనాయుడు, సభ్యులు డ D.సుబ్బారావు, గుడివాడ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
8