Smart City: విజయనగరం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదకరం అని జ్యోతిబాపూలే ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సోమవారం నాడు ఆయన పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రక్షణకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో అదే విధంగా ఇటీవలే ఒరిస్సా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాదాలు సీరియస్ యాక్షన్ తీసుకొని ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముఖ్యమంత్రి తీసుకొనచర్యలు ఎంతైనా ప్రశంసనీయమని మృతుల కుటుంబీకులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి నందుకు జగన్ మోహన్ రెడ్డి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఘటన స్థలి వద్ద సహాయ చర్యల లో నిమగ్నమైన సిబ్బందికి మంచినీరు మరియు ఆహార పదార్థాలను సంఘం తరఫున అందజేశారు. సంఘటన సంఘటన గురించి వార్త తెలియగానే ఢిల్లీ నుంచి వచ్చే ప్రమాద స్థలాన్ని పరిశీలించామని అలాగే ఈరోజు మళ్లీ ఢిల్లీకి వెళ్లి రేపు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మెమొరాండం అందజేస్తామని తెలిపారు.
134