Smart City: సర్వేనంబర్ 242/13 లో మా స్థలాన్ని సొంత బంధువులే ఆక్రమించారు. బాధితుడు బెవర శరత్ కుమార్.

by kishore226226@gmail.com
285 views

Smart City:
పేరుకి ఒక జాతీయ బ్యాంకు ఉద్యోగి మోసాల ఘనాపాటి తాను పనిచేస్తున్న ప్రాంతంలోని రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించడం మొనగాడు బంధువుల ఆస్తులు తనవిగా తన కుటుంబ సభ్యునిగా ఒక నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించాడు చనిపోయిన వారి సంతకాలను సైతం ఫోర్జరీ చేసి సృష్టించాడు ఈ వ్యవహారంలో ఇసుమంత కూడా అనుమానం రాకుండా తనకున్న పరపతితో మేనేజ్ చేశాడు. అసలు ఆస్తిదారులు రంగంలోకి వచ్చారు జిల్లా రిజిస్టార్ కి మరియు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దర్యాప్తు మొదలైంది నకిలీ బాబుపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు ఈ మేరకు అసలు వారసుడు బెంగళూరు నివాసి బెవర శరత్ కుమార్ పోలీసులకు రిజిస్టార్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి తమకు న్యాయం చేయాలని శరత్ కుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులను మీడియా ముఖంగా అధికారుల కు విజ్ఞప్తి చేశారు వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన బెవర సుగుణకు ఇద్దరు కుమారులు ఆమె మధురవాడ చంద్రంపాలెం పరిధిలోని సర్వే నెంబరు242/13 బంధువులతో కలిసి పిల్ల సన్యాసిరావు దగ్గర 7 ప్లాట్లు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబరు:9253/1985 ప్లాట్ లకు సంబంధించి కొంత స్థలాన్ని దారిగా వదిలారు అనంతరం 2014 ఆగస్టులో కుటుంబ ఆస్తులు పంపిణీలో భాగంగా ఆస్తిని తన ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చారు రిజిస్టర్ నెంబరు5164/2014. సుగుణ సమీప బంధువు సంచాన మురళీధర్ ఆస్తిపై కన్ను వేశాడు వృత్తిరీత్యా భారతీయ స్టేట్ బ్యాంకు విజయనగరం జిల్లా గజపతినగరం శాఖలో పనిచేశాడు తన పరపతిని ఉపయోగించి చనిపోయిన సన్యాసిరావు సత్యనారాయణ ఆస్తితోపాటు మరికొందరి ఆస్తిని తమ బంధువుల పేరిట గజపతినగరంలో రిజిస్టర్ కార్యాలయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆస్తికి పూర్వపు హక్కుదారులు సన్యాసిరావు2013 లోను ఎస్ సత్యనారాయణ 2010 లోను మృతి చెందారు అయినా మృతుల పేరిట నకిలీ వ్యక్తుల సృష్టించి తన ఉద్యోగ పరపతితో విశాఖ మధురవాడ కార్యాలయంలో చేయవలసిన రిజిస్ట్రేషన్లు 2016లో గజపతినగరంలో చేయించాడు అందరూ విశాఖపట్నం చిరునామా కలిగి విశాఖలో ఉంటున్నారు పోలీసులు మరియు రిజిస్టార్ ని మోసం చేసి తమ ఆస్తులను మరియు రాస్తా/ దారిని కబ్జా చేయడానికి యత్నిస్తున్న స్టేట్ బ్యాంకు పూర్ ఉద్యోగి సంచాన మురళీధర్ మరియు రామ మోహన్ రావు అతని బంధువులపై తక్షణం చట్టపరమైన చర్యలు చేపట్టాలని దీనికి మీడియా వారు సహకారం అర్థిస్తూ బాధితుడు బెవర శరత్ కుమార్ తమ అభ్యర్థనను విన్నవించుకున్నారు

Related Posts

Leave a Comment