43
Smart City: క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CCAP) వారు చేతి వృత్తులు మరియు హస్తకళలు వారికి ప్రోత్సాహం పునరుజ్జీవం కలిగించుటకు వసంతం ప్రదర్శనలు నిర్వహిస్తుంది. మీరు ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత వస్త్రాలు మరియు హస్తకళా వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా సంప్రదాయ కళాకారులు మరియు చేనేత పనివారలకు చేయుటను జీవనోపాధిని కలిగించినవారవుతారు. ఆధునిక ప్రపంచంలో తమ చేతిపనులను సజీవంగా ఉంచడానికి ఈ కళాకారులలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. దయచేసి వసంతం ప్రదర్శన తిలకించి వీరికి మీ మద్దతు తెలియచేయండి.
“వసంతం “ పేరిట హస్తకళలు మరియు చేనేతలు ప్రదర్శనను డిసెంబర్ 1 మరియు 2 తేదీలలో రెండు రోజులు పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.