Smart City: N FASHION FIZZ Men’s Wear Disney ప్రస్తుత పోటీ వస్త్ర ప్రపంచంలో ప్రజల అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి N ఫ్యాషన్స్ మరింత అభివృద్ధి చెందాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. జడ్జి కోర్టు దగ్గరలో గల సుధా నర్సింగ్ హోమ్ ఎదురుగా నెలకొల్పిన N ఫ్యాషన్స్ మెన్స్ వేర్ షోరూం ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మగవాళ్లకు సంబందించిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించడం విశేషమని అన్నారు. అంతేకాకుండా వివిధ రకాల బ్రాండ్ల వస్త్రాలు తక్కువ ధరలకే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద కొనుగోలుదారులకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. షోరూం యజమాని రాజు మాట్లాడుతూ ఈ నెల 25 నుండి డిసెంబర్ 25 వరకు వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందని, కూపన్ లను డిసెంబర్ 31న లక్కీ డ్రా తీసి డ్రా లో మొదటి బహుమతి గెలుపొందిన వారికి బ్యాంకాక్ టూర్, రెండవ బహుమతిగా సైకిల్, మూడవ బహుమతిగా 5 వేల రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు. బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కూడా తమ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. అంతే కాకుండా నగరంలో ఎక్కడా లేని విధంగా తమ షోరూంలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశామని తమ వద్ద వస్త్రాలు కొనుగోలు చేసిన వారిని ఒక్కరోజు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించనున్నట్లు రాజు తెలిపారు.
33