smart city news:
అరకు పార్లమెంట్ బిజెపి కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత కు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. అడుగు అడుగున గీతకు హారతులు పడుతు బొట్టుపెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు.
సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత గారి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమయ్యింది. ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధులగుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీ గా గెలిపించి ప్రధాని నరేంద్ర మోది గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు.
ఈరోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కానీ,వైసిపి ప్రభుత్వ హయంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు. నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే సంకల్పించాను ప్రతి మండల్లోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందర్నీ కలసి అక్కడున్న సమస్యలను, మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలి. అంతేగాని మీరు వేరు నేను మీరు వేరు కాదని తెలిపారు. ఒకటే. కూటమి పార్టీలంత సైన్యంలా కదలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు.
117
previous post